అదిరిపోయే ఫీచర్స్‌తో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్
03 September 2023
భరత్ లో టూవీలర్ వెహికల్స్‌లో రారాజు అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ అంటే వాహన ప్రియులకు తెగ మోజు.
భారత దేశ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుతున్న టూవీలర్స్‌లో బైక్స్ లో బుల్లెట్ ప్రథమస్థానంలో ఉంటుంది.
భారత్‌తో పాటు యూరప్, ఆసియా పసిఫిక్, అమెరికా దేశాల్లోనూ విస్తరిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్.
సరికొత్త ఫీచర్స్, స్సెషల్ స్పెసిఫికేషన్స్‌తో అందుబాటులోకి వచ్చేసింది రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బుల్లెట్ 350.
జే సిరీస్ ప్లాట్‌ఫాం ఆధారంగా 2023 ఇయర్ లో కొత్త అవతారంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వచ్చేసింది.
మిలిటరీ, స్టాండర్డ్, బ్లాక్ గోల్డ్ మూడు రంగుల్లో కట్టి పడే అందంతో రూపొందిన బుల్లెట్ 350 వేరియంట్స్.
ధర విషయానికి వస్తే.. మిలిటరీ వేరియంట్ రూ.1,73,562, స్టాండర్డ్ రూ.1,97,436, బ్లాక్‌గోల్డ్ రూ.2,15,801.
ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో 349 సీసీ, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, 20.2 బీపీహెచ్, 27ఎన్‌ఎంతో 5 స్పీడ్ గేర్‌బాక్స్.
మైలేజీ విషయానికి వస్తే.. నిర్దేశిత ప్రమాణాలలో కొత్త బుల్లెట్ 36.2 కేఎంపీఎల్ ఉంటుందని తెలుస్తోంది.
కొత్త బుల్లెట్ 350లో ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్క్‌లను, వెనుక రెండు షాక్స్ ఉంటాయి.
కొత్త చాసిస్‌తో పాటు బుల్లెట్‌లో తొలిసారిగా డ్యూయల్ చానల్ ఏబీఎస్ చేర్చారు. రోటరీ స్విచ్‌గేర్, మొబైల్ ఫోన్ చార్జింగ్ పోర్ట్ ఎక్స్‌ట్రా ఫీచర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి