11 August 2023

యూపీఐ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. అదేంటో తెలుసుకోండి

యూపీఐ వినియోగదారుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు

యూపీఐ లైట్ వినియోగదారుల కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లావాదేవీ పరిమితిని పెంచింది. దీంతో పిన్‌ అవసరం లేకుండా చేసుకోవచ్చు

ఇప్పుడు యూపీఐ లైట్‌ ఫీచర్‌తో ఎలాంటి పిన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయకుండా రూ. 500 వరకు లావాదేవీలు చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది

మరోవైపు ఆఫ్‌లైన్ చెల్లింపు విధానాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తి  కాంతదాస్‌  ప్రకటించింది

యూపీఐ లైట్‌ని ఎన్‌సీపీఐ, ఆర్బీఐ అందరి కోసం సెప్టెంబర్ 2022లో ప్రారంభించాయి. ఇది యూపీఐ చాలా సులభమైన వెర్షన్‌గా పరిగణిస్తున్నారు

బ్యాంక్‌ల ప్రాసెసింగ్ వైఫల్యం కారణంగా వినియోగదారులు సమస్యలను ఎదుర్కొకుండా ఉండాలనే లక్ష్యంతో యూపీఐ ఈ లైట్ వెర్షన్ ప్రారంభం

UPI ద్వారా ప్రతిరోజూ ఒక లక్ష రూపాయల లావాదేవీలు చేయవచ్చు. అదే సమయంలో ఇప్పుడు యూపీఐ లైట్ ద్వారా రూ.500 లావాదేవీని చేయవచ్చు

ఇంతకు ముందు ఈ పరిమితి రూ.200 మాత్రమే ఉండేది. తాజాగా ఈ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా