రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్‌.. ఇకపై వందే భారత్‌లో 

19 September 2023

వందే భారత్‌ రైళ్లు భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చిన విషయం తెలిసిందే. అత్యాధునిక సదుపాయాలతో ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య ఈ వందే భారత్‌ రైళ్లు సేవలందిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. 

అయితే ప్రస్తుతం ఈ రైళ్లలో కేవలం ఏసీ చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ బోగీలు మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

అయితే త్వరలోనే వందే భారత్‌ రైళ్లలో కూడా స్లీపర్‌ కోచ్‌ బోగీలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఈ బోగీల తయారీ కూడా ప్రారంభమైంది. 

మరో ఆరు నెలల్లోనే స్లీపర్‌ భోగీలతో పాటు, వందే భారత్‌ మెట్రో రైళ్లు సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. 

ఇక తక్కువ టికెట్ ఛార్జీలతో కూడిన వందే భారత్ కూడా అందుబాటులోకి రానుంది. ఇవి నాన్‌ ఏసీ రైళ్లుగా అందుబాటులోకి రానున్నాయి. 

వందే భారత్‌లో సుదీర్ఘ ప్రయాణం చేయాలంటే ఇబ్బందితో కూడుకున్న విషయం. అందుకే ఇందులో కూడా స్లీపర్‌ బోగీలను ప్రవేశపెట్టాలని అధికారులు చూస్తున్నారు. 

ఇక నాన్‌ ఏసీ ట్రైన్‌ల విషయానికొస్తే వీటిని పుష్‌పుల్ ట్రైన్‌లుగా తీసుకురానున్నారు. ఇందులో ఇంజన్‌తో పాటు 22 బోగీలు ఉంటాయి. అక్టోబర్ 31నుంచి అందుబాటులోకి రానున్నాయి.