రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 15వ విడత వచ్చేది ఆ నెలలోనేనా..

20 సెప్టెంబర్ 2023

పేద, సన్నకారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది

కేంద్ర పథకాలు

ఈ పథకాలలో ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన అత్యంత ప్రసిద్ది చెందింది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ యోజనను ప్రారంభించింది

 రైతుల కోసం..

ఈ పథకం కింద సన్న కారు రైతులకు సంవత్సరానికి రూ.6000 అందిస్తోంది కేంద్రం. ఈ మొత్తం రైతులకు రూ.2వేల చొప్పున మూడు వాయిదాల్లో అందజేస్తారు

రైతులకు రూ.6 వేలు

ఈ వాయిదాల మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 14 విడతల పీఎం కిసాన్‌ను విడుదల చేసింది

4 విడతలు విడుదలయ్యాయి

ఇప్పుడు 15వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు రైతులు నిరీక్షణకు తెరపడనుంది.

15వ విడత

మీడియా నివేదికల ప్రకారం.. నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం 15వ విడత విడుదల చేసే అవకాశం ఉంది

నవంబర్‌లో 15వ విడత

అయితే పీఎం కిసాన్‌ 15వ విడతకు సంబంధించి కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

అధికారిక ప్రకటన రాలేదు

మీరు పీఎం కిసాన్‌ 15వ విడత పొందాలంటే మీరు ఇ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది కేంద్రం

 ఇ-కేవైసీ తప్పనిసరి