16 April 2024
TV9 Telugu
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉండటంతో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నాయి.
ఇక ఎలక్ట్రిక్ రంగంలో ఓలా స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరల్లోనే అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి
ఎంట్రీ లెవల్ స్కూటర్ ఎస్1 ఎక్స్ మాడల్ ధరను 5 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు తగ్గించింది ఓలా
ఫిబ్రవరి నెలలో ఎస్1 ఎక్స్ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ.. కేవలం రెండు నెలల్లోనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది
తగ్గించిన ఈ ఎంట్రీ లెవల్ స్కూటర్ ఎస్1 ఎక్స్ మాడల్ కొత్త ధర వెంటనే అమలులోకి రానున్నట్లు ఓలా కంపెనీ వర్గాలు వెల్లడించాయి
దీంతో పాటు 4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ ధర 1,09, 999 రూపాయల నుంచి 99,999 రూపాయలకు దిగిరానుంది
3 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ ధర కూడా 89,999 రూపాయల నుంచి 84,999కి రూపాయలకు తగ్గించింది
2 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ 79,999 రూపాయల నుంచి 69, 999 రూపాయల వరకు దిగిరానున్నాయి