దేశీయ మార్కెట్‌కు ఓలా ఎంట్రీలెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ధర ఎంతో తెలుసా?
ఎస్1ఎక్స్ స్కూటర్ ప్రారంభ ధర రూ.79,999. కొత్త ఎస్1ఎక్స్ మోడల్ మూడు రకాల్లో ఎస్1ఎక్స్(2 కిలోవాట్ల బ్యాటరీ), ఎస్1ఎక్స్(3 కిలోవాట్ల బ్యాటరీ), ఎస్1ఎక్స్+ కూడా 3 కిలోవాట్ల బ్యాటరీ.
తయారైన ఈ స్కూటర్లలో పలు కొత్త ఫీచర్స్‌తో తయారు చేసినట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో భావిష్ అగర్వాల్ తెలిపారు.
వీటిలో 2 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఎస్1ఎక్స్ ధర రూ.79,999, ఈ ధరలు తొలి వారం మాత్రమే ఉంటాయని, ఆ తర్వాత ఈ స్కూటర్ ధరను రూ.89,999.
మూడు కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఎస్1ఎక్స్ ప్రారంభ ధర రూ.89,999 కాగా, వారం తర్వాత ఈ బైకు ధర రూ.99,999.
రూ.99,999 ప్రారంభ ధర కలిగిన ఎస్1ఎక్స్+ మోడల్ వారం తర్వాత ఈ స్కూటర్ ధరను రూ.1,09,999కి సవరించనుంది. వచ్చే నెల చివర్లో డెలివరీ చేయనున్నది.
సింగిల్ చార్జ్‌తో ఎస్1ఎక్స్ మోడల్ స్కూటర్ 151 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుందని కంపెనీ వెల్లడించింది.
వీటితోపాటు రూ.1,47,499 ధర కలిగిన ఎస్1ప్రో మోడల్‌ను కూడా విడుదల చేసింది.
ప్రస్తుతం సంస్థ రూ.89,999 మొదలుకొని రూ.1.47 లక్షల లోపు ధర కలిగిన మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తుంది.