విజయవాడ టూ తిరుపతి.. ఇకపై నాలుగున్నర గంటలే

Ravi Kiran

31 May 2025

విజయవాడ టూ బెంగళూరు మధ్య ఓ వందేభారత్ రైలును పట్టాలెక్కించాలని చూస్తోంది రైల్వేశాఖ. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఇక విజయవాడ టూ తిరుపతి నాలుగున్నర గంటలే.. ఎలాగంటారా.!

విజయవాడ టూ తిరుపతి..

 విజయవాడ టూ బెంగళూరు వందేభారత్ ట్రైన్ మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు నడవనుంది. ట్రైన్ నెంబర్ 20711తో విజయవాడలో ఇది ఉదయం 5.15 గంటలకు బయల్దేరి.. బెంగళూరుకి 14.15 గంటలకు చేరుకుంటుంది. 

విజయవాడ టూ తిరుపతి..

 తిరుగు ప్రయాణంలో 20712 నెంబర్‌తో బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి.. విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌కు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం స్టాప్‌లు‌గా ఉండనున్నాయి.

విజయవాడ టూ తిరుపతి..

ఉదయం విజయవాడ(ఉదయం 5.15) నుంచి బయల్దేరిన రైలు.. తిరుపతి(ఉదయం 9.45)కి కేవలం నాలుగున్నర గంటల్లోనే చేరుకోనుంది. ముఖ్యంగా శ్రీవారి భక్తులకు ఈ ట్రైన్ అత్యంత సౌకర్యంగా ఉండనుంది. 

విజయవాడ టూ తిరుపతి..

అదే విధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి.. తిరుపతికి 18.55 గంటలకు.. విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది.

విజయవాడ టూ తిరుపతి..

ఇప్పటివరకు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లేవారికి ప్రతీ రోజూ నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మూడు రోజులు మాత్రమే నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

విజయవాడ టూ తిరుపతి..

డైరెక్ట్ బెంగళూరు చేరుకోవడానికి విజయవాడ ప్రయాణీకులకు సరైన ట్రైన్ సదుపాయం లేకపోయింది. ఇక ఈ వందేభారత్ ట్రైన్ అందుబాటులోకి వస్తే వారికి ప్రయాణ సమయం తగ్గడమే కాదు.. కష్టాలు కూడా తీరినట్టే. 

విజయవాడ టూ తిరుపతి..