అలాంటిదేమి లేదు.. దీని కోసం ఎలాంటి గడువు లేదు..స్పష్టం చేసిన మంత్రి

10 July 2024

TV9 Telugu

ఎల్‌పీజీ సిలిండర్ల కోసం ఈకేవైసీ (eKYC) అథెంటికేషన్ ప్రక్రియను పాటించేందుకు ఎలాంటి కాలపరిమితి లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీస్పష్టం చేశారు. 

ఎల్‌పీజీ 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ రాసిన లేఖపై పూరీ స్పందించారు.

సోషల్ మీడియా

వంట గ్యాస్ సిలిండర్ల వినియోగదారుల ఈ-కేవైసీ ప్రక్రియకు ఎటువంటి తుది గడువు లేదని ఆయన స్పష్టం చేశారు.

వంట గ్యాస్ 

2023లోనే ఎల్పీజీ ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర చమురు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 

ఈ-కేవైసీ ప్రక్రియ

గ్యాస్ ఏజెన్సీల వద్దే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కొన్ని సంస్థలు పట్టుబట్టడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా మంత్రి  ఈ ప్రకటన చేశారు.

గ్యాస్ ఏజెన్సీ

గ్యాస్‌ వినియోగదారులు తమ సమయానుకూలంగా సమీపంలో ఉన్న గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ సెంటర్‌కు వెళ్లి కూడా ఈ కేవైసీ చేసుకోవచ్చు.

గ్యాస్‌ వినియోగదారులు

అలాగే కేంద్ర చమురు సంస్థల యాప్‌లు ఇన్ స్టాల్ చేసుకుని సొంతంగా ఈ-కేవైసీ అప్ డేట్ చేయొచ్చు’ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.

ఈ-కేవైసీ అప్ డేట్

అయితే గ్యాస్‌ వినియోగదారులు కేవైసీ చేసుకోవాలని నిబంధన ఉన్నా.. ఇందు కోసం ఎలాంటి గడువు విధించలేదని మంత్రి స్పష్టం చేశారు.

కేవైసీ