01 October 2023
సోషల్ మీడియా షాపింగ్ లో ఎక్కువ ట్రావెల్ ఆపరేటర్లకు అనుకూలమైన బిజినెస్ జరుగుతోంది. Instagram, Facebook, Twitter వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా షాపింగ్ జరుగుతోంది.
ఈ ట్రెండ్ మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మెటా వివరాల ర్కారం సోషల్ మెడియా ద్వారా జరిగే వ్యాపారం ఇంస్టా గ్రామ్ ఒక బిలియన్ కంటే ఎక్కువ వినియోగదారులను కలిగి ఉంది.
అనేక కొత్త ఇ-కామర్స్ స్టార్టప్‌లు సోషల్ మీడియా ద్వారా విక్రయించడం, వినియోగదారులను నేరుగా కనెక్ట్ చేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఈ స్టార్టప్‌లను సోషల్ కామర్స్ స్టార్టప్‌లుగా పిలుస్తారు.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల కొనుగోలుదారులు, విక్రేతలు ఇద్దరికీ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొనుగోలుదారులు కూడా మరిన్ని ఆప్షన్లను వినియోగించుకుంటారు.
దీని వలన వ్యాపారులకు కస్టమర్ నాడి బాగా తెలుస్తుంది. ఇది సందేహాలు.. సమాధానాలు ఇచ్చే విధంగా ఉంటుంది అందువల్ల కస్టమర్ రివ్యూలు ప్రొడక్ట్ క్వాలిటీని మెరుగుపరుచుకునే అవకాశమూ వారికి దొరుకుతుంది.
ఇక సోషల్ మీడియాలో షాపింగ్ చేయడం వలన కస్టమర్స్ కి కూడా అదే విధమైన అవకాశం వస్తుంది. నేరుగా అక్కడ నుంచి ప్రొడక్ట్ విషయంలో ఏదైనా తేడా వస్తే ప్రశ్నిస్తే అది చాలా మందికి రీచ్ అయిపోతుంది.