30 August 2023

హీరో మోటోకార్ప్‌ కస్టమర్ల కోసం సరికొత్త కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌ బైక్‌

సరికొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌ బైక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది

 సాంకేతికను ఉపయోగించి సరికొత్త హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌  బైక్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడి

ఈ సరికొత్త కరిజ్మా  బైక్‌ ఎల్లో, రెడ్‌, బ్లాక్‌ కలర్స్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడి

దీని ధర 1,72,900 రూపాయలతో ప్రారంభం అవుతుందని హీరో మోటోకార్ప్‌ వెల్లడి

ఈ సరికొత్త కరిజ్మా బైక్‌ ఆగస్టు 29వ తేదీ నుంచే బుకింగ్స్‌ ప్రారంభించినట్లు హీరో మోటోకార్ప్‌ తెలిపింది

ఇది మునుపటి మోడల్‌కంటే కాస్త భిన్నంగా తయారు చేసింది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఈ బైక్‌ను బుక్‌ చేసుకోవచ్చు

భారత మార్కెట్లో మరోసారి పూర్తిగా కొత్త స్టైల్‌లో విడుదలైన ఈ బైక్‌ అత్యంత శక్తివంతమైన ఇంజన్‌తో వస్తుంది

DOHC లిక్విడ్‌-కూల్డ్‌ ఇంజన్‌ను 210సీసీ కెపాసిటీతో 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌, 25.5PS పవర్‌, 20.4Nm టార్క్‌ ఉత్పత్తి