3 అక్టోబర్ 2023
తాజాగా భారత్‌కు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్ సంస్థ ఎమ్‌ఎక్స్‌మోటో భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది
ఎంఎక్స్‌వీ ఈకో పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో తీసుకొచ్చారు
ఇందులో సర్క్యూలర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఏప్రాన్ మౌంటెడ్ క్రోమ్ స్లేటెడ్ గ్రిల్, టేపరింగ్ బాడీ ప్యానెల్స్, డైనమక్ ఎల్‌ఈడీ లైట్స్
ఇక ఇంటిగ్రేటెడ్ డీఆర్‌ఎల్స్, వైడ్ హ్యాండిల్ బార్, స్లీక్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్ వంటి ఫీచర్స్‌ను అందించారు
ఎంఎక్స్‌వీ ఈకోలో టీఎఫ్‌టీ డిస్ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్ వంటి అధునాతన ఫీచర్స్‌తో తీసుకొచ్చారు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో తీసుకొచ్చారు. చిన్న బ్యాటరీ ప్యాక్ రేంజ్ 100 కి.మీ వరకు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది
పెద్ద బ్యాటరీ120 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. 75 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది
ఎక్స్‌షోరూం ధర రూ. 84,999గా ఉంది. ఈ స్కూటర్ డెలివరీలు ఎప్పటి నుంచి అన్నది కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు