ఎంజీ మోటార్ ఇండియా నుంచి దేశీయ మార్కెట్లోకి కొమెట్ ఈవీ స్పెషల్ గేమర్ ఎడిషన్
6 August 2023
దీని ధర రూ.8.65 లక్షలు (ఎక్స్ షోరూమ్), కొమెట్ ఈవీలో పేస్, ప్లే, ఫ్లష్ వేరియంట్లతో పోలిస్తే స్పెషల్ గేమర్ ఎడిషన్ వేరియంట్ ధర రూ.64,999 ఎక్కువ
గత మే నెలలో ఎంజీ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లో తొలుత రూ.7.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు లాంచ్ చేసింది
టాటా టియాగో ఈవీ కారుతో పోలిస్తే సుమారు రూ.50 వేలు తక్కువ, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 230 కి.మీ దూరం ప్రయాణించవచ్చు
ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో గానీ, ఎంజీ డీలర్ షిప్‌ల వద్ద గానీ రూ.5000 పే చేసి బుక్ చేసుకోవచ్చు
రెండు డోర్ల కారు కొమెట్ ఈవీ ఫ్రంట్‌లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎంజీ లోగో, డే టైం రన్నింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్
12-అంగుళాల ఎయిరోడైనమికల్లీ డిజైన్డ్ స్టీల్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రేర్ పార్కింగ్ కెమెరా తదితర ఫీచర్లు
బ్యాటరీకి ఎనిమిదేండ్లు లేదా 1.20 లక్షల కి.మీ వారంటీ కోసం రూ.5000 పే చేయాలి
మూడేండ్లు లేదా లక్ష కి.మీ వరకు స్టాండర్డ్ వారంటీ, మూడేండ్ల లేబర్ ఫ్రీ సర్వీస్, మూడేండ్ల రోడ్ సైడ్ అసిస్టెన్స్ తదితర ఆప్షన్లు కల్పిస్తారు
ఇక్కడ క్లిక్ చేయండి