మహీంద్రా నుంచి సరికొత్త ట్రాక్టర్‌.. ధర, సామర్థ్యం ఎంతో తెలుసా

20 March 2024

TV9 Telugu

వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కార్ల లాగానే ట్రాక్టర్‌లు కూడా కొత్త వేరియంట్లలో వస్తున్నాయి.

వ్యవసాయ రంగంలో

మహీంద్రా గ్రూపునకు చెందిన మహీంద్రా ట్రాక్టర్‌.. దేశీయ మార్కెట్లో ఓజా సిరీస్‌లో నయ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ఓజా సిరీస్‌లో

రైతులకు ఉపయోగపడే విధంగా తక్కువ బరువుతో రూపొందించిన 4 డబ్ల్యూడీ మహీంద్రా ఓజా 3140 మాడల్‌ను ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టింది.

తక్కువ బరువుతో

ఈ మహీంద్రా ట్రాక్టర్‌ 30-40 హెచ్‌పీ సామర్థ్యంతో రూపొందించిన ఈ ట్రాక్టర్‌ ప్రారంభ ధర రూ.7.35 లక్షలు.

హెచ్‌పీ సామర్థ్యం

ఈ ధరలు తెలుగు రాష్ర్టాలకు సంబంధించినవి. అడ్వాన్స్‌ గేర్‌ సిస్టమ్‌తో రూపొందించిన ఈ ట్రాక్టర్‌లో మొత్తంగా 24 గేర్లు ఉన్నాయి. 

అడ్వాన్స్‌ గేర్‌ సిస్టమ్‌

చిన్న స్థాయి రైతులు సులభంగా, సురక్షితంగా వేగవంతంగా తమ భూమిని చదును చేసుకునే విధంగా దీనిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 

చిన్న స్థాయి రైతులకు

వచ్చే రబీ సీజన్‌లో ట్రాక్టర్లకు డిమాండ్‌ ఉంటుందని మహీంద్రా సంస్థ భావిస్తుంది. ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది.

వచ్చే రబీ సీజన్‌లో

అత్యాధునిక ప్రొజా, మైజా, రోబోజా వంటి టెక్నాలజీతో తయారైన ఈ మాడల్‌ పనితీరు చాలా మెరుగ్గా ఉంటుందని మహీంద్రా కంపెనీ చెబుతోంది.

కొత్త టెక్నాలజీ