అదేపనిగా టీవీ చూస్తే ఏమవుతుందో తెలుసా?

12 December 2024

Ravi Kiran

టీవీ ఎక్కువగా చేస్తే ఆయుష్షు తగ్గుతుందా అని అడిగితే కచ్చితంగా అని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

సాధారణంగా మనందరం కొంచెం రిలాక్సేషన్ కోసం టీవీ చూస్తుంటాం. అయితే ఎక్కువ సేపు టీవీ చూస్తే మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందట. 

మనం టీవీ చూస్తున్నంత సేపు ఒకే చోట కూర్చుంటాం. అలా ఎక్కువ సేపు కదలకుండా ఉండటం వల్ల బరువు పెరగడం, గుండె జబ్బులు, మధుమేహం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువట.

ఒక గంటసేపు టీవీ చూస్తే 22 నిమిషాల జీవితకాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు. 

ఓ అధ్యయనం ప్రకారం.. టీవీ చూడనివారితో పొలిస్తే రోజుకు 6 గంటల పాటు టీవీ చూసేవారు 5 ఏళ్లు తక్కువ జీవిస్తారని తేలింది.

అందువల్ల టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోండని వైద్యులు చెబుతున్నారు. ఇతర స్క్రీన్లనూ తక్కువగా చూడండి. 

వీటికి బదులుగా ఏదైనా శారీరక శ్రమ ఉండే పనులను కల్పించుకోవడం మంచిదని డాక్టర్ల సూచన.