2023లో ఏ కంపెనీ ఎంత మంది ఉద్యోగులను తొలగించింది.. పూర్తి వివరాలు

11 October 2023

2023 సంవత్సరంలో వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఏయే కంపెనీలు ఉద్యోగులను తొలగించాయో వివరాలు ఇక్కడ ఉన్నాయి.

కంపెనీల వివరాలు

ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ కూడా ఉద్యోగులను తొలగించింది. మొత్తం 12,000 మంది ఉద్యోగులను తొలగించింది.

గూగుల్‌ ఉద్యోగుల తొలగింపు

ఫుడ్‌టెక్‌ కంపెనీ స్విగ్గీ జనవరి 20న 380 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది.

స్విగ్గీ నుంచి ఉద్యోగుల తొలగింపు

బెంగళూరుకు చెందిన ఎక్సోటెల్‌ కంపెనీ కూడా జనవరి 20న 15 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎక్సోటెల్‌ కంపెనీ ఉద్యోగులు

బెంగళూరుకు చెందిన డంజో జనవరి 17న తమ ఉద్యోగులలో 3 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

డంజో కంపెనీ ఉద్యోగులను

ఖర్చులను తగ్గించుకుందుకు షేర్‌చాట్‌ సంస్థ కూడా తమ ఉద్యోగులను తొలగించింది. ఇందులో భాగంగా 20 శాతం ఉద్యోగులు తొలగిపోయారు

షేర్‌చాట్‌ ఉద్యోగులు

జనవరి రెండో వారంలో వివిధ యూనిట్లకు చెందిన 200 మంది వరకు ఉద్యోగులను ఓలా కంపెనీ కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఓలా కంపెనీ ఉద్యోగులు

కంపెనీలకు ఆశించినంత ఆదాయం రాలేని కారణంగా ఇటీవల 3,900 మంది ఉద్యోగులను  IBM కంపెనీ తొలగింపులు చేసింది.

ఆశించిన ఆదాయం రాక