మీకు ఇది తెలుసా.! తులం బంగారం ధర రూ. 18, ఎప్పుడంటే.?

Ravi Kiran

02 April 2024

భారతీయుల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ బంగారు నగలు ధరిస్తారు. 

ప్రస్తుతం బంగారం ధర పైపైకి దూసుకెళుతోంది. బంగారం ధరలు మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పుటి ధరలను గుర్తు చేసుకుంటున్నారు

ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 62 వేలకు పైగా ఉండగా ఒకప్పుడు తులం బంగారం ధర రూ.18 రూపాయలే మాత్రమే ఉండేదట.

పూర్వం చాలా తక్కువ ధరకే బంగారం లభించేదని గుర్తు చేసుకుంటున్నారు. 1930లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.18 అంట

1940లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.36 కాగా,  1950లో అది రూ.99కి చేరింది. ఇక 1960లో  రూ.111గా,  1970లో రూ.184గా ఉంది

1980లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1330 కాగా, 1990లో రూ.3200గా, 2000 సంవత్సరంలో రూ.4400గా ఉంది. 

2010లో రూ.18500గా బంగారం ధర ఉండగా, 2020లో రూ.48,600కి పెరిగింది పసిడి ధర.  ఇక 2022లో రూ.52700గా, 2023లో రూ.61,600గా ఉంది. 

ప్రస్తుతం బంగారం ధరలు అయితే రికార్డు స్థాయిలో రూ. 70 వేలకు చేరుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.70వేలు దాటగా..  22 క్యారెట్ల బంగారం ధర రూ.63,610గా ఉంది.