క్రెడిట్ కార్డు వాడుతున్నారా.? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి
18 January 2025
Ravi Kiran
ఇటీవల ప్రతీ ఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డు ఉంటోంది. అలాగే వాటి వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. అయితే వాటి వాడకంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సిబిల్ స్కోర్ తగ్గి ఇబ్బందులు ఎదురవుతాయి
క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదని.. అలా చేస్తే మీ సిబిల్ స్కోర్ తగ్గి.. లోన్ తీసుకోవాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు
క్రెడిట్ కార్డులపై క్యాష్ అడ్వాన్స్‌లు తీసుకోవద్దని బిజినెస్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రోజువారీ కొనుగోళ్లు, మేజర్ మెడికల్ ఖర్చులకు ఉపయోగించవద్దు
ఇక మీరు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే.. క్రెడిట్ కార్డులను అస్సలు అనవసరమైన కొనుగోళ్లకు ఉపయోగించవద్దు అని అంటున్నారు.
అలాగే ఓల్డ్ క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవద్దు అని.. అలర్ట్స్ సెట్టింగ్స్, కాంటాక్ట్ వివరాలను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని చెబుతున్నారు.
క్రెడిట్ కార్డులపై ఎన్నో రివార్డు పాయింట్లు, బేసిస్ పాయింట్లతో పాటు కొన్ని చోట్ల క్యాష్ బ్యాక్ పాయింట్లు లభిస్తాయి. అయితే ఇవన్నీ కూడా అవసరమైన మేరకు మాత్రం ఉపయోగించుకోవాలి.
క్రెడిట్ కార్డులపై లోన్ సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే అలా లోన్స్ తీసుకోవద్దు అని.. డబ్బులు ఉంటే డెడ్ లైన్ లోపు కట్టేయాలని సూచిస్తున్నారు.