ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పెరగనున్న కియా కార్లు.. కారణం ఏంటో తెలుసా?

22 March 2024

TV9 Telugu

వచ్చే నెల 1వ తేదీ నుంచి తమ వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కియా ఇండియా సంస్థ ప్రకటించింది.

వచ్చే నెల నుంచి

కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి వాహన ధరలు పెరగనున్నాయి.

ఉత్పత్తి ధరలు

సెల్టోస్‌, సోనెట్‌, కారెన్స్‌ వాహన ధరలను పెంచక తప్పడం లేదని కియా ఇండియా నేషనల్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ హెడ్‌ హర్దీప్‌ సింగ్‌ తెలిపారు.

ఈ వాహనాలు

కమోడిటీ ఉత్పత్తుల ధరలు నిరాటంకంగా పెరుగుతుండటం, ఎక్సేంజ్‌ రేట్లలో హెచ్చుతగ్గుదలు, ఉత్పత్తి వ్యయం అధికమవడం కారణంగా పెంపు.

కమోడిటీ ఉత్పత్తుల ధరలు

కార్ల తయారీకి తమపై భారం పడుతున్న కారణంగా కొనుగోలుదారులపై భారం మోపాల్సి వస్తోందని కియా ఇండియా పేర్కొంది.

వాహనదారులపై భారం

ఇప్పటి వరకు సంస్థ 11 లక్షల వాహనాలను దేశీయంగా విక్రయించింది. తమపై భారం అధికంగా పడుతున్న నేపథ్యంలో ఈ ధరలు పెంచనున్నట్లు తెలిపింది.

11 లక్షల వాహనాలు

ఇదిలా ఉండగా, దేశీయంగా త్వరలో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు పెరగనున్నాయి. ఇందులో టూ వీల్లర్స్‌, ఫోర్‌ వీల్లర్స్‌ ఉన్నాయి.

 త్వరలో ఈవీ ధరలు పెంపు

ఉత్పత్తి వ్యయం కారణంగా ధరలను పెంచక తప్పడం లేదని ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలు పేర్కొంటున్నాయి.

ఎలక్ట్రిక్‌ వాహనాలు