జియో కస్టమర్లకు వినాయక చవితి బొనాంజా..

28 August 2023

జియో కస్టమర్లకు వినాయక చవితి రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సంచలన నిర్ణయం. దేశవ్యాప్తంగా త్వరలో అందుబాటులోకి రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలు.బొనాంజా..

గణేష్ చతుర్థి పురస్కరించుకుని సెప్టెంబరు 19, 2023న దేశవ్యాప్తంగా జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలు ప్రారంభం 

46వ AGM సమావేశంలో ఎయిర్‌ఫైబర్‌ సేవల ప్రారంభ తేదీని ప్రకటించిన రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 

జియో ఎయిర్‌ఫైబర్‌ ద్వారా వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్‌. ఇందుకు అనుగుణంగా కంపెనీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ పరికరాన్ని లాంచ్.

Jio Airfiber రిటైల్ కస్టమర్ల కోసం మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలతో అందించనున్నట్లు స్పష్టం చేసిన ముకేశ్ అంబానీ 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్టికల్ ఫైబర్ ద్వారా రోజుకు 15,000 క్యాంపస్‌లు కనెక్ట్ చేసుకునేందుకు అవకాశం. 

Jio AirFiberతో ఈ విస్తరణను రోజుకు 150,000 కనెక్షన్లకు సూపర్ ఛార్జ్ చేయవచ్చని ముకేశ్ అంబానీ వెల్లడి.

Jio Air Fiber 5G నెట్‌వర్క్‌తో పాటు అత్యాధునిక వైర్‌లెస్ టెక్నాలజీని ఉపయోగించి అందుబాటులోకి వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు.

జియో ఎయిర్ ఫైబర్ ద్వారా 200 మిలియన్ల ఇళ్లు, కార్యాలయాలు, ప్రధాన కూడళ్ళకు అందనున్న ఇంటర్నెట్ సేవలు.

జియో ఎయిర్ ఫైబర్ రాకతో, జియో ప్రతిరోజూ 1.5 లక్షల మంది కొత్త కస్టమర్లను జత కలుస్తారనుకుంటోంది జియో.