భారత్‌లో తొలి బడ్జెట్‌ను 1860, ఏప్రిల్ 7వ తేదీన ప్రవేశపెట్టారు. స్వాతంత్రానికి ముందు ఈస్ట్‌ఇండియా స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ బడ్జెట్‌ను బ్రిటిష్ రాణికి సమర్పించారు.
స్వాతంత్ర్యం తర్వాత మొదటి బడ్జెట్‌ను 1947, నవంబరు 26న ప్రవేశపెట్టారు. అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు.
దేశ చరిత్రంలో ఆర్థిక మంత్రులు కాకుండా కొందరు ప్రధానులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వీరిలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ఉన్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు హల్వా వేడుక నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే కోవిడ్ కారణంగా గతేడాది వేడుకను నిర్వహించకుండా, మిఠాయిలు పంచారు.
1995 వరకు బడ్జెట్‌ను ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రచురించేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతులను హిందీ, ఇంగ్లిష్‌లో ప్రచురిస్తూ వచ్చారు.
2021, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించారు. కరోనా నేపథ్యంలో పేపర్‌లెస్ బడ్జెట్‌ను తీసుకొచ్చారు.
2017కి ముందు రైల్వే బడ్జెట్‌ను, వార్షిక బడ్జెట్‌ను వేరువేరుగా ప్రవేశపెట్టేవారు. కానీ 2017 నుంచి ఈ రెండింటిని విలీనం చేశారు.
2016 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిదినం రోజున సమర్పించేవారు. అయితే 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు.
ఆర్థిక మంత్రి హీరుభాయ్ ముల్జీ భాయ్ పటేల్ సమర్పించిన బడ్జెట్ అతి చిన్నది. 1977లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి.