రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఫిబ్రవరిలో ఎంతో తెలుసా..?

03 March 2024

TV9 Telugu

దేశంలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి నెలనెల రెట్టింపు ఆదాయం సమకూరుతోంది. 

నెలనెల రెట్టింపు ఆదాయం

ఫిబ్రవరి నెల 29 రోజుల్లో జీఎస్‌టీ ద్వారా మోడీ ప్రభుత్వానికి మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు. 

ఫిబ్రవరిలో

రోజువారీగా పరిశీలిస్తే.. ఫిబ్రవరి నెలలో ప్రతిరోజు జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.57.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి.

రోజువారీగా పరిశీలిస్తే..

ఈ జీఎస్‌టీ వసూళ్లు గత సంవత్సరం ఫిబ్రవరి వసూళ్లతో పోలిస్తే 12.5 శాతం ఎక్కువ అని కేంద్ర వర్గాలు తెలిపాయి.

గత ఏడాదితో పోలిస్తే..

ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ వసూళ్ల గణాంకాలను సమర్పించింది. దీని ప్రకారం.. ఫిబ్రవరిలో రూ.1,68,337 కోట్ల పరోక్ష పన్ను వసూలు చేసింది.

పరోక్ష పన్ను

పెట్రోలు-డీజిల్, కొన్ని ఇతర వస్తువులు ఇప్పటికీ జీఎస్టీ పరిధికి దూరంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై పన్నులు విధిస్తున్నాయి.

జీఎస్టీ పరిధిలోకి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో దేశంలో స్థూల జీఎస్టీ వసూళ్లు 18.40 లక్షల కోట్ల రూపాయలు.

11 నెలల్లో...

గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పన్ను వసూళ్ల కంటే ఇది 11.7 శాతం ఎక్కువ. ఈ ఏడాది దేశంలో ప్రతినెలా జీఎస్టీ సగటు వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు. 

గతేడాది