ఇలా చేశారంటే.. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా.. టికెట్ పక్కాగా కన్ఫర్మ్.!

29-05-2024

Ravi Kiran

మనం ఏదైనా అత్యవసరమై.. ఊరు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. ముందుగానే రైల్వే టికెట్ బుక్ చేసుకోలేం. అలాంటి సమయంలో వెయిటింగ్ లిస్టు వస్తుంది. కానీ రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. 

ఇలా చేశారంటే.. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా..

రైలు బయల్దేరే ఒక రోజు ముందు ట్రైన్ టికెట్ కోసం చూస్తే చాన్ తాడంత వెయింటింగ్ లిస్ట్ ఉంది. అటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారు. చాలా మంది తాత్కాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తారు. 

ఇలా చేశారంటే.. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా..

అయితే ఇంకో ఆప్షన్ ఉందన్న విషయం చాలా మందికి తెలీదు. అదే హై ఆఫీషియల్ కోటా(హెచ్ఓ కోటా). రైల్వే ఉన్నత అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులకు కదా ఇచ్చేది. సామాన్య ప్రయాణికులు కూడా దీనిని వినియోగించుకోవచ్చా? 

ఇలా చేశారంటే.. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా..

దీనికి సమాధానం అవుననే చెబుతున్నారు రైల్వే అధికారులు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ హెచ్ఓ కోటాను సామాన్య ప్రయాణికులు కూడా వాడుకోవచ్చని వివరిస్తున్నారు. 

ఇలా చేశారంటే.. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా..

రైల్వే ఉన్నత అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు ఇతర ప్రముఖులకు హెచ్ఓ కోటా/ఎమర్జెన్సీ కోటా కింద బెర్త్‌లు మంజూరు చేస్తారు. కొన్ని నిబంధనల మేరకు ఈ టికెట్ భారత రైల్వే మీకు అందిస్తుంది.

ఇలా చేశారంటే.. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా..

నిర్దిష్ట కోటాలో ఉన్నవారికి సీట్లు పొందడంలో ప్రాధాన్యం ఇస్తారు. ఈ కోటాలకు యాక్సెస్ ఉన్న రైళ్లలోని వివిధ తరగతుల్లో సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు. అయితే సాధారణ కోటాలో బుక్ అయినా లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్‌లకు హెచ్ఓకోటా వర్తిస్తుంది. 

ఇలా చేశారంటే.. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా..

రైలులో కొన్ని సీట్లు హెచ్ఓ కోటా కింద రిజర్వ్ అయ్యి ఉంటాయి. దాని కోసం దరఖాస్తు చేస్తే, టికెట్ చాలా త్వరగా కన్ఫర్మ్ అవుతుంది. ఈ కోటాకు అర్హత పొందాలంటే ప్రయాణికుల ప్రయాణం తప్పనిసరి. ఒక ముఖ్యమైన కారణం ఉండాలి. దీనికి మద్దతుగా వారు  డాక్యుమెంటేషన్‌ను అందించాలి. 

ఇలా చేశారంటే.. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా..

బయలుదేరే తేదీకి ఒక రోజు ముందు, సాధారణ ప్రయాణికులు అత్యవసర కోటా(ఈక్యూ) ఫారమ్‌ను చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కు సమర్పించి, అత్యవసర పరిస్థితికి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంటేషన్‌తో పాటు హెచ్ఓ కోటా కోసం దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తుపై గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి. 

ఇలా చేశారంటే.. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా..

దరఖాస్తు రసీదు తర్వాత, డివిజనల్/జోనల్ కార్యాలయం దాని సమాచారాన్ని అందుకుంటుంది. ఆమోదం పొందిన తర్వాత టికెట్ నిర్ధారణ అవుతుంది.

ఇలా చేశారంటే.. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా..