Ravi Kiran
31 May 2024
రైళ్లలో లోయర్ బెర్త్ సీట్ కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తారు. కిటికీ పక్కన కూర్చుని ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
పైగా పైకెక్కే పనికూడా ఉండదు. ఐతే లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ కొందరికి మాత్రమే ఉండటంతో చాలా మందికి ఈ సౌకర్యం కుదరట్లేదు.
సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వ్యక్తులకు మాత్రమే ఇండియన్ రైల్వేస్ లోయర్ బెర్తులు కేటాయిస్తున్నారు.
రైలు ప్రయాణానికి చాలా రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్నా లోయర్ బెర్త్ కేటాయించడం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక కేటాయించిన సీటులోనే సర్దుకుపోతున్నారు.
టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు బెర్త్ ప్రిఫరెన్స్‌ను బట్టి పెద్దవారికి మాత్రమే లోయర్ బెర్తుల కేటాయింపు జరుగుతుంది. ఎలాంటి మానవ ప్రమేయము లేకుండానే ఆటోమాటిక్‌గా సీట్ల కేటాయింపు జరుగుతుందని రైల్వే క్లారిటీ ఇచ్చింది.
ఒకవేళ పెద్దవాళ్లకు ఎవరికైనా మిడిల్, అప్పర్ బెర్తుల్లో సీట్లు కేటాయిస్తే టీటీఈని సంప్రదిస్తే బెర్తుల అందుబాటును బట్టి వారికి వేరే బెర్త్‌లు కేటాయిస్తారు.
మరోసారి ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే పెద్ద వయసున్న వారికి సీనియర్ సిటిజన్ కోటాలో టికెట్ తీసుకోవల్సి ఉంటుంది.
60 ఏళ్లు దాటిన పురుష ప్రయాణికులు, 45 ఏళ్లు దాటిన మహిళా ప్రయాణికులను సీనియర్ సిటిజన్లుగా పరిగణించి లోయర్ బెర్త్ కేటాయిస్తారు.
అలాగే గర్భిణులతో రైళ్లలో ప్రయాణించేటప్పుడు కూడా లోయర్ బెర్త్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు.
ఈ టికెట్లను కేవలం రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లలో మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి వీలుంటుంది.
ఐతే ఒక పీఎన్‌ఆర్ నంబర్‌పై గరిష్ఠంగా ఇద్దరికి మాత్రమే సీనియర్ టికెట్ కోటా కింద టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. రెండు కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేస్తే మిగిలిన టికెట్లు జనరల్ కోటా కింద పరిగణిస్తారు.
అందువల్ల పెద్దల టికెట్ల బుకింగ్‌కు మాత్రం సీనియర్ సిటిజన్ కోటాను వినియోగించుకుంటే లోయర్ బెర్తులు తప్పకుండా దొరకుతాయి. మిగిలిన వారికి బెర్తులను కొంచెం అటూ ఇటూగా బెర్తులు వస్తాయి.