12 August 2023

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా?

ఎక్కడైనా మీ డబ్బును ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా.? బంగారం బెస్ట్ ఆప్షన్. మరి గోల్డ్‌పై మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

బిజినెస్ నిపుణుల అంచనా ప్రకారం.. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక శుభ పరిణామం

ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఒక గ్రాము రూ.5,545గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ.5,962గా నిర్ణయించబడింది.

గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయమన్న అభిప్రాయం సాధారణ మదుపర్లలో నెలకొంది. అలాగే బిజినెస్ నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. 

ఫిజికల్ గోల్డ్‌ పెట్టుబడికి సరైన మార్గం కాదని.. దీని ద్వారా 3 శాతం జీఎస్టీ రూపంలో లాస్ అవుతామని చెబుతున్నారు.

ఆభరణాల అవసరముంటేనే ఫిజికల్ గోల్డ్ కొనాలని సూచిస్తున్నారు. డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూజువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి మంచిదని సలహా ఇస్తున్నారు.

దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్లకు సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సరైన మార్గమని చెబుతున్నారు.

కాగా, ఈ స్టోరీ బిజినెస్ నిపుణుల సలహా ఆధారంగా ప్రచురితం చేయబడింది. మీరు బంగారంలో ఇన్వెస్ట్ చేసేముందు కచ్చితంగా ఓ బిజినెస్ అనలిస్ట్‌ను సంప్రదించండి.