మీరు రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో వేరొకరు దౌర్జన్యంగా కూర్చుంటే..

Ravi Kiran

14 June 2024

రైలు ప్రయాణం అంటేనే గంటల గంటలు సమయం పడుతుంది. అంత సేపు నిలుచోవాలంటే కష్టం కాబట్టి చాలా మంది ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకుంటారు.

మీరు రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో..

వారం, పది రోజుల ముందే రిజర్వ్ బెర్త్‌ల కోసం సీట్లను బుక్ చేసుకుంటారు. నలిగిపోయి వెళ్లడం కంటే ప్రశాంతంగా సీటు బుక్ చేసుకుని వెళ్తే ఎంత బాగుంటుంది. 

మీరు రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో..

అయితే కష్టపడి బుక్ చేసుకున్న వ్యక్తి సీట్లో వేరే వ్యక్తులు కూర్చుంటారు. మేము బుక్ చేసుకున్నామన్నా సరే సీట్లోంచి లేవరు. పైగా దౌర్జన్యం చేస్తారు. రైళ్లలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు ఎదురవుతాయి.

మీరు రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో..

అయితే ఇలాంటి సిట్యువేషన్‌లో మీరు జస్ట్ మీ ఫోన్‌లో ఫిర్యాదు చేస్తే చాలు.. టీసీ వచ్చి వాళ్ళని సీట్లోంచి లేపి మీకు సీట్లు ఇస్తారు. దాని కోసం మొదటగా మీరు మీ టికెట్ మీద ఉన్న సీటు నంబర్, ఆ పరాయి కూర్చున్న సీటు నంబర్ ఒకటే కాదో నిర్ధారించుకోవాలి. 

మీరు రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో..

ఫస్ట్ అయితే ఆ సీటు నాది అని రిక్వెస్ట్ చేయాలి. మనిషి అయితే లేస్తాడు. అప్పటికీ లేవకపోతే ఆ సమయంలో రైలు రైల్వేస్టేషన్‌లో ఆగి ఉంటే రైల్లోంచి రైల్వే సిబ్బందిని పిలిచి చెప్పవచ్చు. వారు సహాయం చేస్తారు. 

మీరు రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో..

ఒకవేళ కదులుతున్న రైలులో సమస్య ఎదురైతే కనుక 139 హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేసి జరిగింది చెప్పవచ్చు. లేదా www.coms.indianrailways.gov.in పోర్టల్ లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా 9717630982 కి ఎస్ఎంఎస్ సెండ్ చేయవచ్చు. 

మీరు రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో..

లేదా ఐఆర్సీటీసీ కంప్లైంట్ నంబర్ 011-23345400 నంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయచ్చు. SEAT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి PNR నంబర్ స్పేస్ కోచ్ నంబర్ సీట్ నంబర్ టైప్ చేసి 139 నంబర్ కి 139 నంబర్ కి మెసేజ్ చేయడం.. లేదా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 

మీరు రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో..

కాసేపటికి టీసీ వచ్చి మీ సీట్లో కూర్చున్న వారిని ఖాళీ చేయిస్తారు. ఇలా మీరు మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో కూర్చున్నవారిని ఖాళీ చేయించవచ్చు.

మీరు రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో..