13 September 2023

క్షణాల్లో బ్యాంక్ స్టేట్‌మెంట్ పొందండి ఇలా..!

తమ కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది ప్రభుత్వ రంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

కస్టమర్లకు మరింత చేరువైందకు అవసరమైన అన్ని సదుపాయాలను , విధానాలను ప్రవేశపెడుతోంది ఎస్‌బీఐ. 

ఎస్‌బీఐ అకౌంట్ ఉంటే చాలు.. ఏటీఎం కానీ బ్యాంకులకు గానీ వెళ్లకుండానే పలు రకాల సేవలు అందిస్తోంది. 

బ్యాంక్, ఏటీఎం వెళ్లకుండానే మీ అకౌంట్ బ్యాలెన్స్ సహా మినీ స్టేట్‌మెంట్ తెలుసుకోవడం ఇకపై చాలా సింపుల్. 

ఏదైనా లోన్, క్రెడిట్ కార్డు బిల్లు, ఇతర ముఖ్యమైన లావాదేవీల కోసం.. ఖర్చులను బేరీజు వేసుకునేందుకు ఇలా అన్నింటికి ఇది అవసరం. 

ఇకపై ఒక్క మిస్డ్ కాల్, SMS ద్వారా బ్యాంకు బ్యాలెన్స్, స్టేట్‌మెంట్ అత్యంత సులువుగా పొందవచ్చు. 

బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ పొందేందుకు 09223766666/09223866666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. 

బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే మీరు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాంక్ బ్యాలెన్స్, విత్‌డ్రా సేవల్ని చేసుకోవాలంటే SBI ATM లేదా ఇతర ఎస్‌బీఐ యేతర ATM కూడా ఉపయోగించవచ్చు. 

ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా రిజిస్టర్ అయిన వినియోగదారులు బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ వివరాలను తెలుసుకోవచ్చు.