Ravi Kiran
18 August 2024
ఇండియన్ రైల్వేస్.. ప్రపంచంలో అతిపెద్ద నెట్‌వర్క్స్‌లో ఒకటని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ప్రతీ రోజూ కోట్లాది మంది ప్రయాణీకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తూ ఉంటుంది. ఇక ఇండియన్ రైల్వేలో సుమారు 14 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
స్టేషన్స్‌లో ఏర్పాటు చేసుకునే ఫుడ్ స్టాల్స్, బుక్ స్టాల్స్ ద్వారా కూడా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే స్టేషన్స్‌లో ఉండే స్టాల్స్‌లో మంచి వ్యాపారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఇంతకీ రైల్వే స్టేషన్స్‌లో స్టాల్స్‌ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి.? ఇందుకోసం ఎంత ఖర్చవుతంది.? లాంటి వివరాలు ఇప్పుడ తెలుసుకుందాం
రైల్వే స్టేషన్స్‌లో స్టాల్స్‌ను ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే టెండర్లను జారీ చేస్తుంది. ఈ టెండర్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ద్వారా స్టేషన్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు లైసెన్స్ పొందొచ్చు.
రైల్వే స్టేషన్‌లో ఒక్కో స్టాల్‌కు ఒక్కో రకమైన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. స్టాల్ ప్రదేశాన్ని బట్టి ఫీజు వసూలు చేస్తారు. బుక్ స్టాల్, ఫుడ్ స్టాల్, టీ-కాఫీ స్టాల్ వంటి వాటికి ఏరియా ఆధారంగా రూ. 40 వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది.
రైల్వే స్టేషన్స్‌లో బుక్ స్టాల్ లేదా ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ వంటి ఏదైనా డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఐఆర్‌సీటీసీతో పాటు ఇండియన్ రైల్వే వెబ్‌సైట్‌లోనూ టెండర్ విభాగం ఉంటుంది. ఇందులోకి వెళ్లి స్టేషన్స్‌లో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సమాచారం పొందొచ్చు.
రైల్వే సైట్‌లో టెండర్లయ్యకే ఛార్జీలతో పాటు ఇతర కండిషన్స్‌కు సంబంధించిన వివరాలు పొందొచ్చు.