హైదరాబాద్ టూ బెంగళూరు.. ఇకపై 8 గంటలు కాదు.. రెండు గంటలే!

21 February 2025

Ravi Kiran

హైదరాబాద్ టూ బెంగళూరు.. విమానంలో అయితే రెండు గంటల ప్రయాణం. కానీ, రైలులో మాత్రం తక్కువలో తక్కువ ఓ 12 గంటల సమయం పడుతోంది. 

రెండు కూడా ఐటీ సిటీలే కావడంతో.. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తరచుగా ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రయాణీకులు రాకపోకలు సాగించే వారి సంఖ్య భారీగా ఉంటోంది.

దాదాపు 12 గంటలు అయితే టైం వేస్ట్.. ఇకపై టైమ్‌కు ఎంతో ఇంపార్టెన్స్‌ ఇచ్చేవారు బాధపడాల్సిన పని ఉండదు. ఎందుకంటే.. త్వరలోనే హైస్పీడ్‌ రైలు ప్రారంభించేందుకు ఇండియన్‌ రైల్వేస్‌ సిద్ధమవుతోంది.

ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వచ్చింది. ఈ నమూనాతోనే హైదరాబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ చెన్నై హైస్పీడ్ ట్రైన్ కారిడార్లకు ఎఫ్ఎల్ఎస్‌కు రైల్వే అధికారులు టెండర్లు ఆహ్వానించారు.  

హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ కారిడార్ పొడవు 705 కిలో మీటర్లుగా ప్రతిపాదించగా, హైదరాబాద్ – బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ పొడవు 626 కిలో మీటర్లుగా ప్రతిపాదించారు.

ఈ హైస్పీడ్ రైలు గంటకు సుమారు 320కిలో మీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. ఫైనల్ లొకేషన్ సర్వే కు టెండర్లను రైల్వే బోర్డు ఆమోదిస్తే రాబోయే 8 ఏళ్లలో హైదరాబాద్ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరుకు హైస్పీడ్ రైళ్లు పరుగులు పెట్టనుంది.

హైస్పీడ్ రైళ్లకోసం ప్రత్యేక ట్రాక్‌లను ఏర్పాటు చేయాల్సి ఉన్నందున మొదటి దశలో ఎఫ్ఎల్ఎస్ సర్వే చేసేందుకు టెండర్లను ఆహ్వానించారు. ఈ సర్వేను కేంద్ర రైల్వే బోర్డుకు పంపిస్తారు. 

దీన్ని బోర్డు ఆమోదిస్తే భౌగోళికమైన మ్యాపింగ్, భూమి స్వభావంపై పరీక్షలు నిర్వహిస్తారు. తరువాత బ్రిడ్జింగ్, టెన్నెలింగ్, బిల్డింగ్స్, ఇతర నిర్మాణాలతో సహా వివణాత్మక అంచనాలతో టెండర్లు పిలుస్తారు.