13 September 2023

గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రత్యేకంగా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదా?

మేడి క్లెయిమ్ గ్రూప్ పాలసీ ఉంది.. ఇక చాలు.. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 

ఇలా ఆలోచించడం తప్పు. మేడి క్లెయిమ్ - హెల్త్ ఇన్సూరెన్స్ రెండిటికీ చాలా తేడా ఉంది.

మేడి క్లెయిమ్ హాస్పిటల్ ఖర్చు కవర్ చేస్తుంది.. అంటే ఆసుపత్రిలో చేరినపుడు అయ్యే ఖర్చులు మాత్రమె కవర్ చేస్తుంది.

అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఆసుపత్రిలో జాయిన్ అయిన ఖర్చులే కాకుండా opd, మెడిసిన్స్ వంటి ఖర్చులను కూడా కవర్ చేసుంది. 

మేడి క్లెయిమ్ లో కవర్ లిమిటెడ్ ఉంటుంది. చాలా సార్లు ఇది 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండదు.  

హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు ఎంత మొట్టనికైన పాలసీ తీసుకోవచ్చు. 

ఇక హెల్త్ ఇన్సూరెన్స్ తో పోలిస్తే మేడి క్లెయిమ్ లో ఇన్సూరెన్స్ తక్కువ మొత్తానికే ఉంటుంది. అలాగే ఖర్చు కూడా తక్కువే అవుతుంది.