04 March 2024
తగ్గేదేలే.. ఇకపై ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా ఆ సేవలు..
TV9 Telugu
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్ని చిన్న టీ కొట్టుల వరకు యూపీఐ పేమెంట్స్‌ను అంగీకరిస్తున్నారు. దీంతో యూపీఐ రంగం ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.
దీంతో ప్రముఖ కంపెనీలన్నీ యూపీఐ సేవలను అందిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు యూపీఐ సేవలను అందిస్తున్నాయి.
తాజాగా ఈ రంగంలోకి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా వచ్చి చేరింది. ఫ్లిప్‌కార్ట్ యపీఐ సేవల్ని యాక్సిస్ బ్యాంక్ సహకారంతో ప్రారంభించింది.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఏడాది నుంచి ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండగా తాజాగా విడుదల చేశారు.
దీంతో ఇకపై ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా నేరుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. షాపింగ్ చేసే సమయంలో ఫ్లిప్‌కార్ట్ యూపీఐతోనే పేమెంట్ చేసుకోవచ్చన్నమాట.
సొంతంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల యూజర్లకు మెరుగైన షాపింగ్ అనుభూతి ఇవ్వొచ్చని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది.
కేవలం షాపింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. రీఛార్జ్, బిల్ పేమెంట్స్ విషయంలో ఫాస్ట్ సర్వీసెస్‌ను కూడా అందించనున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..