01 August 2024
TV9 Telugu
ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణ ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి.
భారత ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్) 2024 పొడిగింపును ప్రకటించింది.
గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ స్కీమ్‌ను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.
వాస్తవానికి జూలై 31న ముగియనున్న ఈ పథకం ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది.
ఏప్రిల్ 1న ప్రారంభమైన ఈఎంపీఎస్ 2024కి మొదట రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్ ఇప్పుడు రూ.778 కోట్లకు పెరిగింది.
ఈ పథకం 5,60,789 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మద్దతు ఇచ్చేలా అందుబాటులో ఉంచారు. ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లు వంటి ఈవీ త్రీ-వీలర్‌లను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు.
ఈఎంపీఎస్ 2024లో కేటాయించిన సబ్సిడీ ఎలక్ట్రిక్ టూవీలర్‌లో ప్రతి కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంపై రూ. 5,000గా ఉంటే, 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన టూవీలర్‌పై రూ. 10,000 సబ్సిడీ.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గరిష్ట సబ్సిడీ కూడా రూ.10,000కే పరిమితం చేశారు. 2024 బడ్జెట్‌లో భారతీయ మార్కెట్‌లోని ఎలక్ట్రిక్ వెహికల్ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక చర్యలు.