రెండు మూడు క్రెడిట్ కార్డులు ఉన్నాయా.? ఈ తప్పులు వద్దు..
TV9 Telugu
04 January 2025
క్రెడిట్ కార్డును జాగ్రత్తగా ఉపయోగిస్తే ఆపదలో ఉపయోగపడే స్నేహితుడు లాంటిది.. లేకపోతె అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.
ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటె ప్రయోజనకంగానే ఉంటుంది. కానీ, వాటిని విచక్షణతో ఉపయోగించినపుడు మాత్రమే అనేది గుర్తుంచుకోవాలి.
క్రెడిట్ కార్డ్ వాడకంలో వడ్డీ రహిత కాలం చాలా ముఖ్యమైన విషయం. ఈ కాలంలో, మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తాన్ని వాటి గడువు తేదీల్లోగా తిరిగి చెల్లించినంత కాలం ఎటువంటి ఇబ్బంది ఉండదు.
అలా చేస్తే ATM నగదు ఉపసంహరణలపై మినహా, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఎలాంటి వడ్డీ విధించరు. లావాదేవీ తేదీ ఆధారంగా ఈ వ్యవధి 18-55 రోజుల మధ్య ఉండవచ్చు.
మీ దగ్గర ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉంటె.. మిగిలిన వడ్డీ రహిత వ్యవధి ఆధారంగా వివిధ కార్డ్‌ల ఖర్చులు పేమెంట్స్ రొటేట్ చేసుకోవడం ద్వారా లబ్ది పొందవచ్చు.
మీ రీపెమేంట్ కేపాసిటీకి మించి ఖర్చు చేయవద్దు. గడువు తేదీలోగా మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లును తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఫైనాన్స్ ఛార్జీల రూపంలో సంవత్సరానికి 23-49 శాతం వడ్డీ భారం పడుతుంది.
చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే అదనంగా నెలకు రూ. 1,300 వరకు లేట్ పేమెంట్ చార్జీలు కూడా చెల్లించాల్సి వస్తుంది.
మీ కార్డ్‌లను తెలివిగా ఉపయోగించుకోండి. గడువు తేదీలోగా మీరు బకాయిలను క్లియర్ చేయగలిగితే మాత్రమే ఖర్చు చేయండి. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నవారు రివార్డ్ పాయింట్స్ నుంచి లాభాన్ని పొందేలా ఖర్చు చేయవచ్చు.