అంబానీ ఇంట్లో ఉద్యోగం కావాలా.? కావాల్సిన అర్హతలివే

Ravi Kiran

26 Aug 2024

రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే టాప్-10 ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. 

ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న విషయం కూడా వార్తే అవుతుంది. తాజాగా వారి ఇంట్లో పనిచేసేవారికి ఎంత జీతం ఇస్తారు.? అందుకు కావాల్సిన అర్హతలేమిటి..? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ క్రమంలోనే అంబానీ కుటుంబం నివస్తున్న యాంటిలియాలో పనిమనుషుల జీత భత్యాల గురించి వార్త ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగ్లాగా ఆంటిలియా గుర్తింపు పొందింది. ఈ ఇంటి నిర్మాణం 2010లో పూర్తయింది. యాంటిలియా ఇల్లు మొత్తం 27 అంతస్తులతో నిర్మించారు. 

భారీ భూకంపాలను సైతం ఈ ఇల్లు తట్టుకోగలదు. రికార్టు స్కేలుపై 8 తీవ్రతతో వచ్చినా చెక్కు చెదరదు. ఇకపోతే, అంబానీ ఇంట్లో ఎంత మంది నివసిస్తున్నారు.?

అంబానీ ఇంట్లో వంట చేయాలంటే డిగ్రీ లేదంటే డిప్లమో ఉండాలి. ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది సుమారు 600 మంది వరకు ఉంటారు. వంట చేసేవారి వేతనం నెలకు రూ.2 లక్షలుగా ఉంటుందట. పైగా వారికి పలురకాల ఇంటర్వ్యూలు, టెస్టులు ఉంటాయని తెలిసింది.

ఇక్కడ ఉద్యోగం వచ్చిందంటే.. వారి దశ తిరిగినట్టే అంటున్నారు కొందరు మీడియా వర్గాలు. ముకేశ్ అంబానీ ఇంట్లో పనిచేసే సిబ్బందికి రాయల్ సౌకర్యాలు లభిస్తాయంటున్నారు.

సిబ్బందికి ఉండడానికి ప్రైవేట్ రూమ్ కేటాయిస్తారు. అంతేకాదు.. ఆంటిలియాలో పనిచేసే స్వీపర్లు కూడా నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నారట. ఈ జీతంలో వైద్య, విద్యా భత్యం కూడా ఉంటాయని సమాచారం.