సాధారణంగా బ్యాంకుల్లో బంగారం, డైమండ్స్ వంటి విలువైన వస్తువులను దాచుకోవడానికి మాత్రమే లాకర్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే.
అయితే కొందరు తెలిసో, తెలియకో డబ్బును కూడా లాకర్స్‌లో పెడుతుంటారు. కానీ దీనికి అనుమతి ఉండదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ డబ్బులను లాకర్స్‌లో పెడితే వాటికి ఏదైనా నష్టం జరిగితే బ్యాంకులు అందుకు ఎలాంటి బాధ్యత చెల్లించదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నగలు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను మాత్రమే లాకర్స్‌లో భద్రపరుచుకోవచ్చు. ఆయా బ్యాంకులు తమ నిబంధనలకు అనుగుణంగా ఛార్జీలు వసూలు చేస్తాయి.
ఇక లాకర్స్‌లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ వంటి వాటిని దాచుకోవడానికి నబంధనలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవు.
అలాగే బ్యాంకుకుకానీ, బ్యాంక్ వినియోగదారులకు గానీ ప్రమాదం వాటిల్లే పదార్థాలను లాకర్స్‌లో భద్రపరచడానికి బ్యాంకు నిబంధనలు అనుమతించవు.
ఒకవేళ అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, బ్యాంకు ఉద్యోగులు ఎవరైనా మోసానికి పాల్పడితే ఆ నష్టానికి బ్యాంకులే బాధ్యత వహిస్తాయి.
అయితే ప్రకృతి వైపరిత్యాలైన భూకంపాలు, వరదలు వంటివి సంభవిస్తే బ్యాంకులు నష్టానికి ఎలాంటి బాధ్యత వహించవు. ఇలాంటి సమయాల్లో బ్యాంకులు పటిష్ట చర్యలు తీసుకుంటాయి.