అమెరికా - చైనా మధ్య వ్యాపారం ఎంతో తెలుసా?

TV9 Telugu

05 February 2025

చైనా దేశంపై 10 శాతం సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

అమెరికా చైనా నుంచి ఏమి తీసుకుంటుంది. ఏమి ఇస్తుంది. ప్రతి సంవత్సరం రెండు దేశాల మధ్య బిలియన్ల విలువైన వ్యాపారం జరుగుతుంది.

అమెరికా నుంచి ఎగుమతి, దిగుమతి వస్తువుల ధరలపై ప్రభావం చూపే చైనాపై సుంకాలు విధించాలనే నిర్ణయాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు.

అమెరికా స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, బొమ్మలు, వీడియో గేమ్ కన్సోల్‌లు, లిథియం-అయాన్ బ్యాటరీలు వంటి వస్తువులను చైనా నుండి దిగుమతి చేసుకుంటుంది.

అమెరికా యంత్రాలు, వ్యవసాయం, రసాయనాలు, ప్లాస్టిక్, రబ్బరు, తోలు వస్తువులను చైనా దేశం ఎగుమతి చేస్తుంది.

ప్రయాణ, మేధో సంపత్తి, ఆర్థిక సేవలు యునైటెడ్ స్టేట్స్ of అమెరికా నుంచి చైనా దేశానికి ఎగుమతి అవుతున్నాయి.

రోడ్లు, రైల్వేలు, ఇంధన సరఫరాలు, టెలికమ్యూనికేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడానికి చైనా నిధులు అందిస్తుంది.

అమెరికా డేటా ప్రకారం, గత ఏడాది మొదటి 11 నెలల్లో, చైనా నుంచి 401 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంది. అయితే వాణిజ్య లోటు 270 బిలియన్ డాలర్లు.