రుణగ్రహితలకు షాకిచ్చిన ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
09 August 2023
ఎంపిక చేసిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ని 15 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
పెరిగిన రేట్లు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. ఈ తాజా నిర్ణయంతో ఖాతాదారుల ఈఎంఐలు మరింత పెరగనున్నాయి
ఒక్కరోజు రుణాలపై ఎంసీఎల్‌ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరగడంతో రేటు 8.25 శాతం నుంచి 8.35 శాతానికి పెరిగింది
నెల రుణాలపై ఎంసీఎల్‌ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరగడంతో రేటు 8.45 శాతానికి చేరుకుంది
అంతకుముందు రేటు 8.30 శాతంగా ఉంది. అలాగే మూడు నెలల రుణాలపై రేటు 8.60 శాతం నుంచి 8.70 శాతానికి చేరుకుంది
ఆరు నెలల రుణాలపై వడ్డీరేటు 8.90 శాతం నుంచి 8.95 శాతానికి సవరించింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్ 9.05 శాతం నుంచి 9.10 శాతానికి, రెండేండ్ల రుణాలపై రేటు 9.15 శాతానికి చేరుకుంది
మూడు సంవత్సరాల బ్యాంకు రుణాలపై రేటు 9.20 శాతానికి సవరించింది బ్యాంకు
ఇక్కడ క్లిక్ చేయండి