02 September 2023
ఐటీ రీఫండ్స్ పేరుపై మెసేజ్.. వాటిని క్లిక్ చేశారో మీ డబ్బు హాం..ఫట్!
మీరు మీ మొబైల్‌లో ఆదాయపు పన్ను రీఫండ్‌కు సంబంధించిన ఏదైనా మెసేజ్ వస్తే దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఆ మెసేజ్ లో మీ ఎకౌంట్ నెంబర్ లేదా ఇతర సమాచారాన్ని వేరిఫై చేయాలని కోరితే మరింత జాగ్రత్త వహించాలి.
ఎందుకంటే, అటువంటి మెసేజెస్ పూర్తిగా నకిలీవి. ఇటువంటి మెసేజెస్ కి రిప్లై ఇవ్వడం మీ బ్యాంక్ ఎకౌంట్ ను ఖాళీ చేసే అవకాశం ఉంటుంది.
ఇక ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు ఐటీ శాఖ రీఫండ్స్ ఇచ్చే దశలో పనిచేస్తోంది.
ఈ నేపధ్యంలో సైబర్ నెరగాళ్లు ఐటీ రీఫండ్స్ పేరిట ఇటువంటి మెసేజెస్ పంపి బ్యాంకు ఎకౌంట్స్ నుంచి డబ్బు కాజేస్తున్నారు.
ఇదే విధమైన వైరల్ సందేశాన్ని ప్రభుత్వ అధికారిక వాస్తవ తనిఖీ సంస్థ 'PIB ఫాక్ట్ చెక్' స్పష్టం చేసింది.
ఇటువంటి మెసేజ్ ఫెక్ అని ఆదాయపు పన్ను శాఖ కూడా వెల్లడించింది. ఇలా చాలామంది మోసపోయినట్లు ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది.
ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ ఎకౌంట్ అప్ డేట్ కోసం మెసేజ్ పంపించదు. అలాగే లింక్స్ క్లిక్ చేయమని చెప్పదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి