13  September 2023

పండుగ ఆఫర్లు ప్రకటించిన బీవోబీ.. గృహం, కార్లు కొనేవారికి మంచి అవకాశం

ఇళ్లు, కారు కొనుగోలు చేసేవారి కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ ప్రత్యేక ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవచ్చని బ్యాంకు తెలిపింది

గృహ, కారు, వ్యక్తిగత, విద్యా రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) మంగళవారం పండుగ ఆఫర్లను ప్రకటించింది

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రకటించిన ఆ ఆఫర్‌ డిసెంబర్‌  2023 వరకు అందుబాటులో ఉండనున్నాయని సదరు బ్యాంకు వెల్లడించింది

పండుగ ఆఫర్లలో భాగంగా వివిధ ప్రయోజనాలను, రాయితీలను అందించే నాలుగు కొత్త సేవింగ్స్‌ ఖాతాలను ప్రారంభించినట్టు తెలిపింది

డెబిట్‌, క్రెడిట్‌కార్డు హోల్డర్లకు పండుగ ఆఫర్లను, డిస్కౌంట్లను అందచేయడానికి ఎలక్ట్రానిక్స్‌, ట్రావెల్‌, ఫుడ్‌ విభాగాల్లో టాప్‌ బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకున్నట్టు బీవోబీ వెల్లడి

పండుగ సీజన్లో గృహ రుణాలు కనిష్ఠంగా 8.40 శాతం వడ్డీ రేటు నుంచి లభిస్తాయని, కార్‌ లోన్లు 8.70 శాతంతో మొదలువుతాయని తెలిపింది

ఈ రెండింటికీ ప్రాసెసింగ్‌ ఫీజును పూర్తిగా రద్దుచేస్తున్నట్టు బ్యాంక్‌ తెలిపింది. విద్యా రుణాల్ని 60 బేసిస్‌ పాయింట్ల డిస్కౌంట్‌తో 8.55 శాతం నుంచే అందిస్తున్నట్టు పేర్కొంది

విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా సంస్థలో సీటు పొందిన విద్యార్థులకు కొలాటరల్‌ లేకుండానే రుణం మంజూరు చేస్తామని తెలిపింది