29 May 2024
TV9 Telugu
మే నెల ముగియనుంది. తర్వాత జూన్ నెల ప్రారంభమవుతుంది. బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లేవారు ఉందస్తుగా బ్యాంకుల సెలవులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
జూన్ నెలలో 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో ఆదివారం, రెండవ, నాల్గవ శనివారం కారణంగా 6 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
పండుగల కారణంగా మిగిలిన రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. జూన్ నెలలో 10 బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. కొ కొన్ని రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి.
జూన్ 2న ఆదివారం, జూన్ 8న రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయని ఆర్బీఐ విడుదల చేసిన జాబితాలో తెలిపింది.
జూన్ 9న ఆదివారం, జూన్ 15న YMA డే లేదా రాజా సంక్రాంతి కారణంగా భువనేశ్వర్, ఐజ్వాల్ జోన్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
జూన్ 16న ఆదివారం, జూన్ 17న బక్రీ ఈద్ పండగ కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు బ్యాంకులు మూసి ఉంటాయి.
జూన్ 18న బక్రీ ఈద్ కారణంగా జమ్ము మరియు శ్రీనగర్ జోన్‌లలో బ్యాంకులు బంద్, జూన్ 22న నాల్గవ శనివారం, 23, 30వ తేదీన ఆదివారాల కారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్