01 September
Subhash
బజాజ్ కంపెనీ ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి CNGతో నడిచే బైక్‌ను విడుదల చేసి అందరిని ఆశ్చర్యపర్చింది.
అయితే ఇప్పుడు బజాజ్ మరో అడుగు ముందుకేసి ఇథనాల్‌తో నడిచే ఈ ద్విచక్ర వాహనాన్ని అతి త్వరలో విడుదల చేయబోతోంది.
బైక్‌లో 100 సీసీ ఇంజన్ ఉంటుంది. ఫ్రీడమ్ 125 తర్వాత మరింత సరసమైన CNG మోటార్‌సైకిల్‌ను బజాజ్ డెవలప్ చేసింది.
ఈ ఇథనాల్ బైక్ వచ్చే ఏడాది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇథనాల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలను విడుదల చేసే అవకాశం.
రాబోయే ఇథనాల్ బైక్ 100 cc సెగ్మెంట్‌లో వస్తుంది. FY 2025 చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి)లో విడుదలయ్యే అవకాశం ఉంది.
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ, చేతక్ బ్రాండ్ నుంచి క్లీన్-ఎనర్జీ కేటగిరీలోని ఇతర ఆఫర్‌లు, ఈ పండుగ సీజన్‌లో కంపెనీ దాదాపు 100,000 యూనిట్లను డెలివరీ చేసే అవకాశం ఉంది.
బజాజ్ ఆటో మొదటి ఇథనాల్ టూ-వీలర్ అయినప్పటికీ, ఇతర ద్విచక్ర వాహనాల కంపెనీలు ఇప్పటికే కాన్సెప్ట్‌లు లేదా ప్రోటోటైప్‌లను ప్రదర్శించాయి.
బజాజ్ తన క్లీన్-ఎనర్జీ వాహనాలతో ఈ పండుగ సీజన్‌లో నెలవారీ విక్రయాలలో దాదాపు 100,000 యూనిట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.