9 September 2023

 వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ కోసం గడువు పొడిగింపు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీని మూడు నెలల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది

మరో మూడు నెలల పాటు ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ అప్‌డేట్‌ తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది

ఇప్పటి వరకు ఆధార్‌  కార్డులో వివరాలు అప్‌డేట్‌ చేసుకునేందుకు చివరి తేదీ 14 సెప్టెంబర్ 2023 ఉండేది. ఇప్పుడు దానిని పొడిగించింది

 ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకునేందుకు 14 డిసెంబర్ 2023 వరకు అవకాశం కల్పిస్తూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అవకాశం కల్పించింది

ఆధార్‌ కార్డుదారుల నుంచి అప్‌డేట్‌ తేదీ పొడిగించాలని విజ్ఞప్తి రావడంతో ఆధార్‌ సంస్థ యూఐడీఏఐ తేదీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

ఇప్పుడు 15 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 14 వరకు myAadhaar పోర్టల్ ద్వారా ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు  కల్పించింది

 మీ వద్ద కూడా 10 ఏళ్ల ఆధార్ కార్డు ఉంటే మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు

ఆధార్ కేంద్రం నుంచి అప్ డేట్ చేసుకుంటే రూ.25 చార్జీ ఉంటుంది. పోర్టల్‌లో అయితే గుర్తింపు కార్డు, చిరునామా రుజువు పత్రాలు అవసరం