08 September 2023
20 ఏళ్లకు తీసుకున్న బ్యాంక్ లోన్ 15 ఏళ్లలో తీర్చేయవచ్చు.. ఈ చిన్నఆప్షన్ తో..
మీరు 20 ఏళ్లకు తీసుకున్న లోన్ 15 ఏళ్లలో తీర్చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే..
మనం బ్యాంక్ లో లోన్ తీసుకునేటప్పుడే ఈఎంఐ ఎంత ఉంటుంది? ఎన్ని సంవత్సరాల్లో లోన్ తీరుతుంది అనేది డిసైడ్ చేసేస్తారు.
ఇది మీ ప్రస్తుత శాలరీ.. వడ్డీరేటు మీద ఆధారపడి నిర్ణయిస్తారు. అయితే, మీ జీతం ప్రతి సంవత్సరం పెరుగుతుంది కదా?
అందువల్ల కావాలంటే మీ ఈఎంఐ పెంచుకుని మీ లోన్ త్వరగా తీరిపోయేలా చేసుకోవచ్చు.
దీనికోసం మీరు step up EMI విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు లోన్ తీసుకునే సమయంలోనే ఈ ఆఫ్షన్ తీసుకోవచ్చు.
ఈ ఆప్షన్ ఎంచుకుంటే, మీ EMI ఫిక్స్ అయిన తరువాత ప్రతి సంవత్సరం కొంత శాతం ఈఎంఐ పెరుగుతుంది.
మీరు 5% పెంచాలని కోరుకున్నారనుకోండి. అలానే ప్రతి సంవత్సరం ఈఎంఐ 5% పెరుగుతుంది.
ఉదాహరణకు మీకు హోం లోన్ పై 22,000 రూపాయల ఈఎంఐ డిసైడ్ అయిందనుకోండి.
అప్పుడు మీరు బ్యాంక్ కు 5% STEP UP EMI ఆప్షన్ అడిగి తీసుకుంటే.. మొదటి సంవత్సరం మీరు ప్రతి నెల 22 వేలు కడతారు.
రెండో సంవత్సరం 5% ఎక్కువ అంటే 23,100 రూపాయలు కడతారు. ఇలా మీరు ప్రతి సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఈఎంఐ కడుతూ లోన్ త్వరగా తీర్చేసుకోగలుగుతారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి