బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోతున్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా గోల్డ్ రేట్స్ ఓ రేంజ్లో దూసుకోతున్నాయి.
ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 64 వేలకు చేరువలో ఉంది. అయితే ఈ ఏడాది బంగారం జోరు ఇలాగే కొనసాగుతుందని చెబుతున్నారు.
2024లోనూ బంగారం ధరలో పెరుగుదల ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి తులం గోల్డ్ ఏకంగా రూ. 70 వేలకు చేరుతుందని అంటున్నారు.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కిలో వెండి ఏకంగా రూ. 90,000 వరకు చేరుకోవచ్చని చెబుతున్నారు.
కరోనా సమయంలో చాలా మంది సురక్షిత పెట్టుబడిగా భావించి బంగారంలో ఇన్వెస్ట్ చేశారు. దీంతో బంగారం ధర భారీగా పెరగడం మొదలైంది.
అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రికత్తలు, ఆర్థిక మందగనం, రూపాయి విలువ బలపడడం కారణాలతో పెట్టుబడిదారులకు గోల్డ్ మంచి ఆప్షన్‌గా మారుతోంది.
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనుగోల్లు తగ్గినా, బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.