పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నూతన భవనంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం ఇచ్చారు.
చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశం భారత్, ఆసియా క్రీడల్లో తొలిసారి వందకుపైగా పతకాలు సాధించాం, దేశంలో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది.
జీ-20 సమావేశాల్లో విజయం, ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని గొప్పగా జరుపుకున్నాం, కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చాం, డిజిటల్ రంగంలో గోప్యతను పటిష్టం చేశాం.
రామమందిర నిర్మాణంతో భారతీయుల కల నెరవేరింది, తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాం.
ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయం, పేదరిక నిర్మూలనే మా సర్కార్ లక్ష్యం, ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళలకు మేలు, జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి.
యూపీ, తమిళనాడులో డిఫెన్స్ కారిడార్లు, స్పేస్ సెక్టార్‌లో యువత కోసం స్టార్టప్‌లు తెచ్చాం, ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగాం.
775 బిలియన్ డాలర్లకు భారత ఆర్థిక శక్తి చేరింది, డిజిటల్ పేమెంట్స్‌లో భారత్ చరిత్ర సృష్టిస్తోంది, గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్‌లో 46 శాతం మనదే,
39 వందే భారత్ రైళ్లను నడుపుతున్నాం, ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఒకటిగాభారత్. ‘మేక్ ఇన్ ఇండియా’ మన నినాదం.