కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో ముఖ్యాంశాలు
TV9 Telugu
01 February 2024
పార్లమెంట్‌లో ఓట్ బడ్జెట్ డిజిటల్ రూపంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి నిమ్మల సీతారామన్.
11.8 కోట్ల మంది అన్నదాతలకు ఆర్థిక సాయం. 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం-నిర్మల. దీంతో దేశవ్యాప్తంగా రైతులకు ఉపకారం జరగనుంది.
పదేళ్లలో పేదరికం తగ్గించాం అని మధ్యంతర బడ్జెట్ ప్రవేశం సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
జన్‌ధన్ అకౌంట్ల ద్వారా రూ.34 లక్షల కోట్లు అందించాం. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశామని బడ్జెట్ లో తెలిపారు ఆమె.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు ఇచ్చాం. దీంతో పని చేసే వెసులుబాటు వచ్చింది.
క్రీడల్లో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. దేశంలో 80 మంది చెస్ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. క్రీడల్లో సాధించిన పతకాలు ఆత్మస్థైర్యాన్ని చాటాయి.
స్టార్టప్ ఇండియా, స్టార్టప్ క్రెడిట్ గ్యారంటీతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామన్న నిర్మలా సీతారామన్.
దేశవ్యాప్తంగా 3 వేల ఐటీఐలు, 390 వర్సిటీలను ఏర్పాటు చేశాం. జాతీయ విద్యా విధానం ద్వారా యువతకు సాధికారత కల్పించాం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి