బడ్జెట్ తర్వాత గోల్డ్ రేట్ తగ్గుతుందా.?
23 January 2024
TV9 Telugu
ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సామాన్యులకు పలు అంశాల్లో ఊరట కల్పించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
జెమ్, జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్.. బంగారం, వజ్రాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఇందులో భాగంగానే బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరింది. ప్రస్తుతం 15 శాతంగా ఉన్న దిగుమతి సుంకం 4 శాతానికి తగ్గించాలని కోరింది.
అలాగే వజ్రాలపై 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించమని జెమ్, జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కేంద్రాన్ని కోరింది.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందిస్తే దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతాయని అంచనా వేస్తున్నారు.
కట్, పాలిష్ చేసిన రత్నాలపై దిగుమతి సుంకం ఎక్కువగా ఉంటే ఎగుమతులు తగ్గుతాయని ఇది ఆభరణాల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్రాన్ని కోరారు.
‘సేఫ్ హార్బర్ రూల్’ను ప్రవేశపెట్టాలని, ఇలా చేస్తే దుబాయ్, బెల్జియం వంటి వ్యాపార కేంద్రంగా భారత్ అవతరిస్తుందని జీజేఈపీసీ ఛైర్మన్ విపుల్ తెలిపారు.
మరి కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకొని, ఈసారి బడ్జెట్‌లో సానుకూల నిర్ణయం తీసుకుంటే బంగారం, డైమండ్ల ధర భారీగా తగ్గే అవకాశాలు ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చేయండి..