ఆదాయపన్ను వర్గాలకు లభించని ఊరట

TV9 Telugu

01 February  2024

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆదాయ పన్ను వర్గాలకు నిరాశ పరిచేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్ణయం.

గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానాన్నే ఈసారీ కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు నిర్మలా సీతారామన్‌.

రూ.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను భారం లేకుండా రిబేటు ఉంటుందని తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

ఎలాంటి పొదుపు, పెట్టుబడులతో పని లేకుండా.. రూ.7 లక్షలకు మించి ఆదాయం కలిగిన వారికి శ్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది.

పలు సెక్షన్ల కింద మినహాయింపులను అనుమతించే పాత పన్నుల విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు అన్నారు ఆమె.

కొత్త పన్ను విధానంలో మినహాయింపును రూ.3 లక్షలకు పెంచగా, ఈసారి దాన్నే కొనసాగించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితి రూ.2,50,000 గానే ఉంటుందని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు ఎలాంటి భారం ఉండదన్న నిర్మలా సీతారామన్.