బడ్జెట్ లీక్ తర్వాత రాజీనామా చేసిన మంత్రి ఎవరో తెలుసా ?

TV9 Telugu

01 February  2024

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్‌ సమర్పించే విధానంలో అనేక మార్పులు జరిగాయి.

2024 ఫిబ్రవరి 1న కొత్త పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌. దేశ చరిత్రలో పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఈమె సొంతం.

స్వాతంత్య్ర భారత దేశంలో 1947 నవంబర్‌ 26న మన తొలి బడ్జెట్‌ను మొదటి ఆర్థిక మంత్రి డాక్టర్‌ ఆర్‌ కే షణ్ముగం చెట్టియార్‌ ప్రవేశపెట్టారు.

ఏడున్నర నెలల కాలానికే ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషం. తొలి బడ్జెట్ మొత్తం అంచనా రూ.171.15 కోట్లు. ద్రవ్య లోటు రూ.24.59 కోట్లు.

1950 వరకు బడ్జెట్‌ ప్రతులను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. అదే ఏడాది బడ్జెట్‌ లీక్‌ కావడంతో న్యూఢిల్లీలోని మింటో రోడ్‌లో బడ్జెట్‌ ముద్రణ ప్రారంభం.

1950 సంవత్సరంలో, జాన్ మథాయ్ భారతదేశ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశ బడ్జెట్ ప్రతులు లీక్ అయ్యాయి.

బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టక ముందే లీక్ అయింద‌ని వార్తలు రావడంతో అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ రాజీనామా చేశారు.

ప్రతి ఏడాది హల్వా వేడుక తర్వాత బడ్జెట్‌ను ముద్రిస్తారు.1955 వరకు కేవలం ఆంగ్లంలోనే బడ్జెట్ ఉండగా.. పేపర్లను హిందీ, ఇంగ్లీషు.. భాషల్లోనూ ముద్రించడం ప్రారంభించారు.