వచ్చే కేంద్ర బడ్జెట్‌లో రైతులకు గుడ్‌న్యూస్..
TV9 Telugu
24 January 2024
ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్‌ను పార్లిమెంట్ సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.
ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుందని ఆర్థిక నిపుణుల అంచనా.
ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు మరింత మేలు చేకూర్చేలా ఈ బడ్జెట్‌పై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
రైతులకు వడ్డీలో రాయితీ కల్పిస్తూ అందించే వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచే అవకాశం.
2024-2025 ఏడాదికి గానూ రుణాల లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం. ఇది బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశం.
రైతులకు అందించే రూ.3 లక్షల వరకు స్వల్ప కాల రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ. సరైన సమయానికి బకాయిలు తీర్చే వారికి మరో 3 శాతం వడ్డీ మినహాయింపు.
ఈ ఆర్థిక ఏడాది మరింత మంది రైతులకు ఈ వడ్డీ రాయితీ రుణాలు అందించాలని భావిస్తున్న భరత్ కేంద్ర ప్రభుత్వం.
ప్రత్యేక క్రెడిట్ డివిజన్ ఏర్పాటు చేసిని కేంద్ర వ్యవసాయ శాఖ. దీని ద్వారా ఎక్కువ మంది రైతులకు ఈ రుణాలు ఇచ్చేందుకు చర్యలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి