ఈ కళ్ళును ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ కళ్ళు ఉప్పులో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కళ్ళు ఉప్పు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యస్థ మెరుగుపడుతుంది.
నిద్రలేమి సమస్యను తొలగించడంలో కళ్ళు ఉప్పు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో కళ్ళు ఉప్పు తీసుకొని బాగా కలుపుకొని తాగడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత లభిస్తుంది.
స్నానం చేస్తున్నప్పుడు నీటిలో ఉప్పు వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. జుట్ట రాలే సమస్యతో బాధపడుతున్నవారు షాంపులో కాళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకొని గార్గిల్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చెడు కొలెస్ట్రాల్, డయబెటిస్ సమస్యలను తగ్గించడంలో కళ్ళు ఉప్పు సహాయపడుతుంది.
కళ్ళు ఉప్పును తూత్ పౌడర్ గా కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగించడం వల్ల చిగుళ్ళు దృఢంగా మారడంలో సహాయపడుతుంది.
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు కళ్ళు ఉప్పు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. వాంతులు అవుతున్నప్పుడు కొంచెం జీలకర్ర,కళ్ళు ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల వాంతులు తగ్గుతాయి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు కళ్ళు ఉప్పు వాడితే మంచి ఫలితాలు కలుగుతాయి. అజీర్ణ సమస్య ఉన్నవారు భోజనం అయ్యాక మజ్జిగలో కళ్ళు ఉప్పు తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది.
దీని ఉపయోగించడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. అయితే సాధరాణ ఉప్పు కంటే కళ్ళు ఉప్పులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.